pavan: పవన్ బాబాయ్ కి స్వార్థం తెలియదు: నిహారిక

  • పవన్ బాబాయ్ మితభాషి 
  • మమ్మల్ని ఆటపట్టించేవాడు 
  • ఆయనలో గర్వాన్ని చూడలేదు      
నిహారిక ప్రధానపాత్రధారిగా చేసిన 'సూర్యకాంతం' ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించింది. "పవన్ బాబాయ్ ఎక్కువగా మాట్లాడడు. .. ఆయన మితభాషి. ఎప్పుడు చూసినా కామ్ గా కనిపించే ఆయన, ఏదైనా ఫంక్షన్ కి వస్తే మాత్రం బాగానే సందడి చేస్తాడు.

మేము ఏదైనా పిచ్చి పనులు చేస్తే ఆటపట్టిస్తాడు .. ఏడిపిస్తాడు. అలాంటి ఆయన జనంలో వేదికలపై నుంచి చేసే ప్రసంగాలు వింటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన ప్రసంగాలు నాకు స్ఫూర్తినిస్తాయి .. అయితే ఈ విషయం ఇంతవరకూ బాబాయ్ కి చెప్పలేదు. నాకు తెలిసి రాజకీయాల్లో అంతటి స్వచ్ఛమైన వ్యక్తి మరొకరు వుండరు. ఆయనకి అసలు స్వార్థమంటే ఏమిటో తెలియదు. ఇక తాను ఓ పెద్ద స్టార్ ను అనే గర్వాన్ని కూడా ఆయనలో నేను ఎప్పుడూ చూడలేదు" అని చెప్పుకొచ్చింది. 
pavan
niharika

More Telugu News