Warangal district: ఏపీలో జగన్ గెలుస్తారు: కేటీఆర్

  • కేసీఆర్ ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ్రంట్ లోకి జగన్ వస్తారు
  • ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నాం
  • ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఏం చేసింది?
ఏపీలో జగన్ గెలుస్తారని  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ్రంట్ లోకి జగన్ వస్తారని, ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. జగన్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, అఖిలేష్ యాదవ్ తో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని విమర్శించారు. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్న మోదీ వేశారా? అని ప్రశ్నించారు. మాటలతో ఆకట్టుకోవడం తప్ప మోదీ చేసిందేమీ లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి150 మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. ఏప్రిల్ 11 తర్వాత పోడు భూముల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారని చెప్పిన కేటీఆర్, గిరిజనుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
Warangal district
Narsampet
TRS
KTR

More Telugu News