Andhra Pradesh: తమ్ముళ్లూ.. సారీ.. వైసీపీ కార్యకర్తలను క్షమాపణ కోరిన జేసీ ప్రభాకర్ రెడ్డి!

  • అనంతపురంలోని పుట్లూరు మండలంలో ఘటన
  • వైసీపీ కార్యకర్తల బైక్ ను ఢీకొట్టిన జేసీ కారు
  • కార్యకర్తలను పరామర్శించి సారీ చెప్పిన జేసీ
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఈ రోజు ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కొందరు వైసీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు. ఈ ఘటన జిల్లాలోని పుట్లూరు మండలంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఎల్లుట్ల గ్రామం వద్దకు రాగానే ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ అటుగా వెళుతున్న వైసీపీ కార్యకర్తల బైక్ ను ఢీకొట్టింది. వెంటనే కారు దిగిన ప్రభాకర్ రెడ్డి వారి దగ్గరకు వేగంగా వెళ్లి పరామర్శించారు. డ్రైవర్ కారణంగా ఈ తప్పు జరిగిందనీ, క్షమించాలని కోరారు. వైసీపీ కార్యకర్తలకు పెద్దగా దెబ్బలేమీ తగలకపోవడంతో వారు బైక్ పై వెళ్లిపోయారు. అనంతరం ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు అస్మిత్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం కోసం ముందుకెళ్లారు.
Andhra Pradesh
Anantapur District
YSRCP
Telugudesam
Road Accident
jc prabhakar reddy
sorry

More Telugu News