cudupha: టీడీపీని వీడిన కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌

  • ప్రతాప్‌ వైఎస్‌కు అత్యంత సన్నిహితుడు
  • ఆయన వైసీపీలో చేరుతారన్న ఊహాగానాలు
  • జగన్‌ డైనమిక్‌ లీడర్‌ అంటూ గతంలో కితాబు
దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో కడప జిల్లాలో అధికార టీడీపీకి షాక్‌ తగిలినట్టయింది. గతంలో రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన సాయిప్రతాప్‌ కేంద్ర మంత్రిగా పనిచేశారు.  వైఎస్‌ మరణానంతరం కొన్నాళ్లు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ అక్కడ ఇమడలేకపోతున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం జగన్‌ డైనమిక్‌ లీడర్‌ అంటూ ప్రశంసించి ఊహాగానాలకు తెరలేపారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడంతో త్వరలోనే వైసీపీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
cudupha
sai pratap
Telugudesam

More Telugu News