Chittoor District: చిత్తూరు జిల్లాలోని ఓ తోట నుంచి భారీగా మద్యం స్వాధీనం : తోట యజమాని వైసీపీ నేత

  • కేసు నమోదు చేసిన పోలీసులు
  • 170 మద్యం కేసులు లభ్యం
  • విలువ రూ.6 లక్షల పైమాటే
చిత్తూరు జిల్లాలో ఓ వైసీపీ నేతకు చెందిన తోట నుంచి పోలీసులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. వి.కోట మండలం కుంభార్లపల్లెలోని మామిడి తోటలో మద్యం అక్రమ నిల్వలు ఉన్నాయన్న సమాచారం మేరకు శుక్రవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 170 మద్యం కేసుల్లో 8,160 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం విలువ 6 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. జరుగుతున్న ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా పంపిణీ చేసేందుకు వీటిని నిల్వ చేశారని భావిస్తున్నారు. మామిడితోట యజమాని శ్రీరాములురెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Chittoor District
licour bottels
police case

More Telugu News