Kurnool District: మన పార్టీకి తోడుగా ఉన్నది చిన్న చిన్న వాళ్లే: నందికొట్కూరులో వైఎస్ జగన్

  • నందికొట్కూరులో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు
  • దశాబ్దాల కాలంగా వైరం ఉన్నవారు ఒక్కటయ్యారు 
  • వైసీపీ పేదోడి పార్టీ
నందికొట్కూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని, దశాబ్దాల కాలంగా వైరం ఉన్న వారు ఒక్కటయ్యారంటూ వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, మన పార్టీకి తోడుగా ఉన్నది చిన్న చిన్న వాళ్లు, చిన్న చిన్న ప్రాణాలేనని అన్నారు. వైసీపీకి సిద్ధార్థ్ లాంటి యువకులు తోడుగా ఉన్నారని, రాబోయే రోజుల్లో సిద్ధార్థ్ ను తన గుండెల్లో పెట్టుకుంటానని, రాజకీయంగా పైకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ పేదోడి పార్టీ అని, యువకుల పార్టీ అని చెప్పడానికి గర్విస్తున్నానని అన్నారు.
Kurnool District
Nandikotkuru
YSRCP
jagan

More Telugu News