Andhra Pradesh: వైసీపీ ‘సింహం’ కామెడీని చూసి జనాలు నవ్వుకుంటున్నారు!: ఏపీ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు

  • ఓవైపు బీజేపీతో పొత్తుకు నహీ అంటారు
  • మరోవైపు వారి సభలకు వైసీపీ కార్యకర్తలను పంపిస్తారు
  • ట్విట్టర్ లో వైసీపీని ఏకిపారేసిన ఏపీ ఐటీ మంత్రి
కర్నూలులో నిన్న ప్రధాని మోదీ సభలో కొందరు వ్యక్తులు వైసీపీ జెండాలో కనిపించడంపై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ వ్యంగ్యంగా స్పందించారు. వైసీపీ నేతలు ఓవైపు బీజేపీతో పొత్తుకు నహీ(వద్దు) అని చెబుతూనే జనాలు రాని బీజేపీ సభకు కార్యకర్తలను పంపించి హమ్ హైనా(మీకు మేమున్నాం) అని భరోసా ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

అక్కడితో ఆగకుండా ఎన్నికల్లో సింహం సింగిల్ గా వస్తుందని పెద్దపెద్ద సినిమా డైలాగులు చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోరాడుతామనీ, సింహం సింగిల్ గానే వస్తుందని వైఎస్ షర్మిల వ్యాఖ్యలను లోకేశ్ ప్రస్తావించారు. ప్రజలు వైసీపీ ‘సింహం’ కామెడీని చూసి నవ్వుకుంటున్నారని దుయ్యబట్టారు.

ఈరోజు లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘అబ్బబ్బబా! పైకి బీజేపీతో 'పొత్తు నహీ' అంటారు, జనాలు రాని బీజేపీ సభకి తమ కార్యకర్తలని పంపించి 'హమ్ హై నా' అని భరోసా ఇస్తారు... మళ్లీ సింహం సింగల్ అంటూ పెద్ద పెద్ద సినిమా డైలాగులు ! జనాలు మీ 'సింహం' కామెడీ చూసి నవ్వుకుంటున్నారు’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
YSRCP
Telugudesam
Sharmila
Narendra Modi
BJP
Nara Lokesh
Twitter

More Telugu News