Srikakulam District: శ్రీకాకుళంలో పవన్ కల్యాణ్ పర్యటనకు అనుమతి నిరాకరణ

  • శ్రీకాకుళంలో ఈరోజు పర్యటించాల్సి ఉన్న పవన్
  • ఇవాళే చంద్రబాబు పర్యటన కూడా
  • పవన్ కు అనుమతి నిరాకరించిన పోలీసులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు శ్రీకాకుళంలో పర్యటించాల్సి ఉంది. అయితే, శ్రీకాకుళంలో సీఎం చంద్రబాబు పర్యటన కూడా ఈరోజే ఉంది. భద్రతా చర్యల్లో భాగంగా పవన్ టూర్ కు అనుమతి ఇవ్వలేమని శ్రీకాకుళం జిల్లా పోలీసులు చెప్పారు. శ్రీకాకుళానికి హెలికాఫ్టర్ లో లేదా రోడ్డు మార్గంలో పవన్ వెళ్లేందుకు పోలీస్ ఉన్నతాధికారుల నుంచి అనుమతివ్వలేదు.

 ఈ నేపథ్యంలో పవన్ పర్యటన వాయిదా పడినట్టు తెలుస్తోంది. పవన్ పర్యటన వాయిదాపై జనసేన పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటన ఉంటే తమ నాయకుడి టూర్ కు అనుమతివ్వకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, శ్రీకాకుళం జిల్లాలో పలు చోట్ల చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇచ్ఛాపురం, నరసన్నపేట, రాజాం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. 
Srikakulam District
janasena
Pawan Kalyan
Telugudesam

More Telugu News