Mahabubabad District: మహబూబాబాద్‌ జిల్లాలో నిలిచిపోయిన పలు రైళ్లు

  • ఇంటికన్నె రైల్వేస్టేషన్‌ సమీపంలో నిలిపివేత
  • విద్యుత్‌ తీగలు తెగిపడడంతో అంతరాయం
  • సకాలంలో గుర్తించిన రైల్వే సిబ్బంది
తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్‌ జిల్లాలో పలు రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే విద్యుత్‌ లైన్‌లోని తీగలు తెగి పట్టాలపై పడడంతో అంతరాయం ఏర్పడింది. దీంతో కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్‌ సమీపంలో పలు రైళ్లను నిలిపివేశారు. వివరాల్లోకి వెళితే...ఈరోజు తెల్లవారు జామున ఇంటికన్నె రైల్వేస్టేషన్‌ సమీపంలోని 418/27 మైలు రాయి వద్ద  ఓహెచ్‌ఈ వైరు తెగి పట్టాలపై పడింది. దీన్ని గమనించిన సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ మార్గంలో రైళ రాకపోకలు నిలిపివేశారు. తక్షణం మరమ్మతు చేపట్టినప్పటికీ పలు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Mahabubabad District
intikanne railway station
rails stoped

More Telugu News