Pawan Kalyan: ఆ ఆఫర్ ఏదో లోకేశ్‌కే ఇవ్వండి.. చంద్రబాబుకు సూచించిన పవన్

  • వైసీపీలో చేరిన ఎస్పీవై రెడ్డి తిరిగి రావాలని చంద్రబాబు పిలుపు
  • వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్
  • అదేదో లోకేశ్‌కే ఇచ్చుకోవాలన్న పవన్
వైసీపీలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పునరాలోచించుకోవాలని, పార్టీలోకి తిరిగి వస్తే బంపర్ ఆఫర్ ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాల, ఆదోని, నందికొట్కూరులలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఆ ఆఫర్ ఏదో తన కుమారుడు లోకేశ్‌కే ఇచ్చుకోవాలని సూచించారు. లోకేశ్‌కు ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుందన్నారు.

 తాను రాయలసీమ వ్యక్తిని కాకున్నా తనలోనూ సీమ పౌరుషం ఉందన్నారు. రాయలసీమలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని, తాము అధికారంలోకి వస్తే అలాంటి భయం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ పథకంగా ప్రకటిస్తామన్నారు.  ఆదోని జామియా మసీదుకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తామని,  రూ.100 కోట్లతో ఆదోని నుంచి కడప దర్గా వరకు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని జనసేనాని హామీ ఇచ్చారు.
Pawan Kalyan
Nara Lokesh
Chandrababu
Jana Sena
Kurnool District
Andhra Pradesh

More Telugu News