Chandrababu: నేను అందరినీ అత్తారింటికి పంపిస్తున్నా, పవన్ కల్యాణ్ మాత్రం దారి వెతుక్కుంటూ పోయాడు: రాజమండ్రి సభలో చంద్రబాబు

  • నా సైకిల్ చెయిన్ తెంపే ధైర్యం ఎవరికుంది?
  • పట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది
  • నా సైకిల్ బుల్లెట్ మాదిరే దూసుకుపోతుంది
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన ప్రసంగాల్లో మధ్యలో చమత్కారాలు, ఛలోక్తులు విసురుతూ సభికులను బాగా నవ్విస్తున్నారు. తాజాగా రాజమండ్రి రోడ్ షోలో కూడా చంద్రబాబు జనసేనాని పవన్ కల్యాణ్ పై ఓవైపు విసుర్లు, మరోవైపు వ్యంగ్యం కురిపించారు. తాను లక్ష రూపాయలిచ్చి ఆడబిడ్డలను అత్తారింటికి పంపిస్తున్నానని చెప్పే క్రమంలో, పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమా తీశారని గుర్తుచేశారు. తాను అందరినీ అత్తారింటికి పంపిస్తుంటే, పవన్ కల్యాణ్ మాత్రం ఆయన దారి ఆయన వెతుక్కుంటూ వెళుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా, పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావించారు. చంద్రబాబు సైకిల్ చెయిన్ ను కేసీఆర్ తెంపేశారని, ఇక సైకిల్ నడవడంలేదని పవన్ అనడం పట్ల తనదైన శైలిలో స్పందించారు.

తన సైకిల్ ను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదని అన్నారు. "నా సైకిల్ ను తాకితే షాక్ తింటారు, నా సైకిల్ తాకి నిలబడగలరా వీళ్లు? సైకిల్ నుంచి కూడా కరెంట్ తయారవుతుంది. అది మామూలు కరెంట్ కాదు. అంత స్పీడుగా వెళుతుంది నా సైకిల్ బుల్లెట్ మాదిరిగా. ఎవరైనా తాకితే అక్కడితో ఫినిష్! అలాంటి సైకిల్ చెయిన్ ను ఎవన్నా తెంపగలరా? వాళ్లను నేను వదిలిపెడతానా?" అంటూ నవ్వులు విరబూయించారు.
Chandrababu
Telugudesam
Pawan Kalyan

More Telugu News