Guntur District: అందుకే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల హృదయాల్లో ఇంకా నిలిచిపోయారు: వైసీపీ నేత షర్మిళ

  • వైఎస్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు
  • పర,తమ అనే భేదం లేకుండా అమలు చేశారు
  • భూములు లాక్కున్న వారి ఉసురు బాబుకు తగులుతుంది
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని, పర,తమ అనే భేదం లేకుండా, మన పార్టీ వాడా? పక్క పార్టీ వాడా? మన కులమా? వేరే కులమా? అన్న విషయాలేవీ చూడకుండా ప్రతి ఒక్కరికీ అండగా నిలిచారని వైసీపీ నేత షర్మిళ గుర్తుచేశారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహిస్తున్న వైసీపీ ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, ఇన్ని మంచి పనులు చేశారు కనుకే, ఇంకా ప్రజల హృదయాల్లో వైఎస్ నిలిచిపోయారని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ఆమె విమర్శలు గుప్పించారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం పూర్తిగా అటకెక్కిందని విమర్శించారు. భూములు లాక్కున్న వారి ఉసురు చంద్రబాబుకు తప్పక తగులుతుందంటూ నిప్పులు చెరిగారు.
Guntur District
Mangalagiri
YSRCP
Sharmila

More Telugu News