YSRCP: నా చెల్లెలు రోజమ్మపై అందరి చల్లని దీవెనలు కావాలి: నగరిలో వైఎస్ జగన్

  • రోజా మంచి చేస్తుందన్న నమ్మకం నాకు ఉంది
  • మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డన్న మంచి చేస్తాడు
  • ‘నవరత్నాలు’కు కట్టుబడి ఉన్నాను
ప్రజలకు ఇచ్చిన హామీలు ‘నవరత్నాలు’కు కట్టుబడి ఉన్నానని, ఈ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే వాటిని కచ్చితంగా అమలు చేస్తానని వైసీపీ అధినేత జగన్ మరోసారి స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని, అందుకు అందరి దీవెనలు కావాలని తమ పార్టీని గెలిపించాలని కోరారు.

‘నా చెల్లెలు రోజమ్మ సౌమ్యురాలు. మంచి చేస్తుందన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు నా చెల్లి రోజాకు ఇవ్వాల్సిందిగా పేరుపేరునా ప్రార్థిస్తున్నా. మన పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా రెడ్డన్న ఉన్నాడు. అన్ని రకాలుగా మంచి చేస్తాడన్న నమ్మకం నాకు ఉంది. రెడ్డన్న మీద కూడా చల్లని దీవెనులు సంపూర్ణంగా మీరందరూ ఉంచాల్సిందిగా రెండు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను’ అని జగన్ కోరారు.
YSRCP
jagan
Roja
nagari
puthuru

More Telugu News