dk aruna: మహబూబ్ నగర్ ను మోదీకి కానుకగా ఇద్దాం: డీకే అరుణ

  • కేసీఆర్ నిరంకుశత్వానికి ముగింపు పలికేందుకే బీజేపీలో చేరా
  • మోదీ సైన్యంలో ఒక సైనికురాలిగా పని చేస్తా
  • ప్రపంచంలో బలమైన నేతగా మోదీ అవతరించారు
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందించేందుుకే తాను బీజేపీలో చేరానని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. మోదీ సైన్యంలో ఒక సైనికురాలిలా పని చేస్తానని చెప్పారు. మహబూబ్ నగర్ లో మోదీ నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడుతూ, ప్రపంచంలోనే మోదీ బలమైన నేతగా అవతరించారని... ప్రపంచ దేశాల్లో భారత్ ను అగ్ర స్థానంలో నిలిపారని అన్నారు. దేశమంతా ప్రస్తుతం మోదీ వైపు చూస్తోందని... మహబూబ్ నగర్ లోక్ సభ స్థానంలో గెలిచి మోదీకి బహుమానంగా ఇద్దామని పిలుపునిచ్చారు.
dk aruna
modi
bjp
kcr
TRS

More Telugu News