modi: ఏపీకి మోదీ ఎందుకు వస్తున్నారంటే..!: చంద్రబాబు

  • ఏపీకి మోదీ నమ్మక ద్రోహం చేశారు
  • దేశాన్ని, ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు
  • వైసీపీకి సాయం చేయడానికి సిగ్గులేకుండా ఏపీకి వస్తున్నారు
రాష్ట్ర విభజనతో కుదేలైన ఏపీకి అండగా ఉంటానని వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ మాట ఇచ్చారని, అయితే ఆ మాటను నిలబెట్టుకోకుండా, ఏపీకి నమ్మక ద్రోహం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఆర్థిక నేరస్థులతో కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు. లక్ష కోట్లు దోచుకున్న ఆంధ్ర నేరస్తులను కటకటాల వెనక ఉంచుతానన్న మోదీ ఇప్పుడు వారితోనే జతకట్టారని విమర్శించారు.

ఒక్క విభజన హామీని కూడా అమలు చేయని మోదీ... సిగ్గులేకుండా వైసీపీకి సాయం చేయడానికి ఏపీకి వస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు మేలుకోవాలని, రాష్ట్ర ద్రోహులకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని, దేశాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా ఆర్థిక వ్యవస్థను, యువతను, రైతులను, వ్యాపారులను, మైనార్టీలను మోదీ సంక్షోభంలోకి నెట్టేశారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.
modi
chandrababu
Telugudesam
bjp

More Telugu News