Telangana: కాంగ్రెస్ పార్టీకి ఝలక్.. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న అరికెల నర్సారెడ్డి!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఈరోజు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నర్సారెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేటీఆర్ నర్సారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 స్థానాలను కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు.
Go Back to Shorts
Telangana
TRS
Congress
KTR
narsareddy

More Telugu News