kalyan ram: 'తుగ్లక్' టైటిల్ తో కల్యాణ్ రామ్ కొత్త సినిమా

  • '118'తో హిట్ కొట్టిన కల్యాణ్ రామ్ 
  • తదుపరి సినిమా వేణు మల్లిడితో 
  • నాయికలుగా రకుల్ .. కేథరిన్     
ఇటీవల కల్యాణ్ రామ్ చేసిన '118' సినిమా ఆయనకి విజయాన్ని తెచ్చిపెట్టింది. నటుడిగా కల్యాణ్ రామ్ చూపిన కొత్తదనానికి మంచి మార్కులు పడ్డాయి. దాంతో తన తదుపరి సినిమా విషయంలో కల్యాణ్ రామ్ మరింత జాగ్రత్త తీసుకున్నాడు. ఆయన తదుపరి సినిమా వేణు మల్లిడి దర్శకత్వంలో ఉండనుంది.

ఈ సినిమాకి 'తుగ్లక్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. కథా కథనాలు .. తన పాత్ర .. తన లుక్ కొత్తగా ఉండేలా కల్యాణ్ రామ్ శ్రద్ధ పెట్టాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయనుండటం విశేషం. కల్యాణ్ రామ్ సొంత బ్యానర్లో రూపొందనున్న ఈ సినిమాలో కథానాయికలుగా రకుల్ .. కేథరిన్ పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన పనులు చకచకా జరుగుతున్నాయి.
kalyan ram
rakul
catherine

More Telugu News