Andhra Pradesh: ఏపీలో పట్టపగలు హత్యాయత్నం.. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని వెంటపడి నరికిన దుండగుడు!

  • ప్రకాశం జిల్లాలోని చీరాలలో ఘటన
  • మాణిక్యాలరావు అనే వ్యక్తిపై కత్తితో దాడి
  • స్థానికులు చుట్టుముట్టడంతో నిందితుడి పరారీ
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి చీరాలలోని ఆంధ్రకేసరి కాలేజీ వద్ద మాణిక్యాలరావు అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఒకరు కత్తితో దాడిచేశాడు. విచక్షణారహితంగా దాడిచేయడంతో మాణిక్యాలరావు స్పృహ కోల్పోయాడు. అంతలోనే చుట్టుపక్కల ఉన్నవారు గట్టిగా కేకలు వేస్తూ అక్కడకు చేరుకోవడంతో భయపడ్డ దుండగుడు ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు.

ఈ సందర్భంగా పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు, రక్తపు మడుగులో పడిపోయిన మాణిక్యాలరావును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Andhra Pradesh
Prakasam District
chirala
attack
Police
murder

More Telugu News