manohar parrikar: పారికర్ చితాభస్మంతో బీజేపీ రాజకీయాలు చేస్తోందంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

ఇటీవల మృతి చెందిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చితాభస్మంతో బీజేపీ రాజకీయాలు చేస్తోందంటూ అందిన ఫిర్యాదుపై గోవా ఎన్నికల సంఘం దర్యాప్తునకు ఆదేశించింది. పారికర్ చితాభస్మాన్ని రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నదుల్లో కలిపేందుకు బీజేపీ వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోందంటూ కొందరు ఈసీకి ఫిర్యాదు చేశారు.

పారికర్ చితాభస్మాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని, ఎన్నికల నియమావళిని ఇది ఉల్లంఘించడమే అవుతుందని న్యాయవాది రోడ్రిగోస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన గోవా ఎన్నికల ప్రధానాధికారి కునాల్ గురువారం ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తమకు అందిన ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.
manohar parrikar
Goa
BJP
EC
CEO

More Telugu News