akshay kumar: 'కేసరి'తో వరుసగా 11వ సారి 100 కోట్ల క్లబ్ లో చేరిన అక్షయ్

  • వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యత
  • విభిన్నమైన పాత్రలపట్ల ఆసక్తి
  •  సొంతమవుతోన్న వరుస విజయాలు  
మొదటి నుంచి కూడా అక్షయ కుమార్ వైవిధ్యభరితమైన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. స్టార్ హీరోలు చేయడానికి ఆలోచించే కొన్ని కథల్లో కనిపించి మెప్పించారు. తన సినిమాల్లో వినోదంతోపాటు సందేశం కూడా ఉండటానికి ఆయన ఇష్టపడతారు. ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి అక్షయ్ చూపే సాహసమే ఆయనకి వరుస విజయాలను కట్టబెడుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన 'కేసరి' సినిమా .. ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతోంది. 7 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇంతవరకూ అక్షయ్ కుమార్ చేసిన సినిమాల్లో, 100 కోట్ల క్లబ్ లోకి చేరిన 11వ సినిమా ఇది. ఈ ఏడాది చాలా తక్కువ సమయంలో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన చిత్రంగా ఇది సరికొత్త రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. 
akshay kumar

More Telugu News