Pawan Kalyan: తనను యాక్టర్ అన్న జగన్‌పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు.. ఆ విషయం గుర్తుంచుకోవాలని హితవు

  • నేను రాజకీయాల్లోకి రాకముందు యాక్టర్‌ను
  • అన్నీ తెలుసుకుని రాజకీయాల్లోకి వచ్చా
  • నువ్వు రాజకీయాల్లోకి రాకముందు జైల్లో ఉండొచ్చావ్
తనను యాక్టర్ అని సంబోధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను రాజకీయాల్లోకి రాకముందు యాక్టర్‌నని, అన్నీ తెలుసుకున్నాకే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ‘‘నువ్వు రాజకీయాల్లోకి రాకముందు జైల్లో ఉండి వచ్చావు.. ఈ విషయాన్ని గుర్తుంచుకో’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించిన పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాము అధికారంలోకి వస్తే రాయలసీమలో ఏ పరిశ్రమ ఏర్పాటైనా స్థానికులకు 60 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఉద్యోగాల దరఖాస్తుల ద్వారా వసూలు చేసే సొమ్ముతో నిరుద్యోగ భృతి ఇస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. జనసేన అధికారంలోకి వస్తే అన్ని ఉద్యోగాలకు ఒకేసారి ఫీజు చెల్లించే విధానాన్ని తీసుకొస్తామన్నారు. పదో తరగతి వరకు చదువుకున్న 25 వేల మందిని    పోలీసు సహాయకులుగా నియమిస్తామని పవన్ హామీ ఇచ్చారు.
Pawan Kalyan
Jagan
YSRCP
Jana Sena
Kadapa District
Andhra Pradesh

More Telugu News