Kadapa District: ఏపీ బీజేపీకి మరో షాక్.. పోటీ నుంచి తప్పుకుని కనిపించకుండా పోయిన బీజేపీ అభ్యర్థి

  • రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా మహేశ్వరరెడ్డి
  • గురువారం నామినేషన్ ఉపసంహరణ
  • ఆ తర్వాత అదృశ్యం.. ఫోన్ స్విచ్ఛాఫ్
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పోటీ రసవత్తరంగా మారుతోంది. ఉపసంహరణకు చివరి రోజైన గురువారం కొన్ని పార్టీల నుంచి రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగినవారు తమ నామినేషన్లు ఉపసంహరించుకుని ఆ పార్టీల అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు చొరవతో ఆ పార్టీ రెబల్స్‌గా బరిలోకి దిగినవారు దాదాపుగా తప్పుకున్నారు.

అయితే, కడప జిల్లా రామాపురం మండలం పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎన్ఆర్ఐ మహేశ్వరరెడ్డి విషయంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన గురువారం ఒక్కసారిగా పార్టీకి షాకిచ్చారు. గురువారం మధ్యాహ్నం తన నామినేషన్ ఉపసంహరించుకున్న మహేశ్వరరెడ్డి ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉండడంతో ఏం జరిగిందో తెలియక బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
Kadapa District
Rajampet
BJP
Maheswara reddy
Andhra Pradesh

More Telugu News