Mahabubnagar: క్రమశిక్షణ నేర్పిన బీజేపీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది: ఎంపీ జితేందర్ రెడ్డి

  • శత్రువులపై మోదీ సర్జికల్ స్ట్రయిక్స్ చేశారు
  • కేసీఆర్ మాత్రం మిత్రులపై చేశారు
  • ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో కొస్తుంది
క్రమశిక్షణ నేర్పిన బీజేపీలోకి తిరిగి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని నిన్ననే టీఆర్ఎస్ ను వీడిన ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. శత్రువులపై మోదీ సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తే, కేసీఆర్ మాత్రం మిత్రులపై సర్జికల్ స్ట్రయిక్స్ చేశారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో నిన్న ఆ పార్టీ కండువాను జితేందర్ రెడ్డి కప్పుకున్నారు.
Mahabubnagar
bjp
mp
jitender reddy

More Telugu News