Andhra Pradesh: హైదరాబాద్ లో ఎక్కువ ఆస్తులున్నది చంద్రబాబుకే: తలసాని ఆరోపణలు

  • నీతికి నిజాయతీకి మారుపేరైనట్టు బాబు మాటలు!
  • ‘పోలవరం’కు మా ప్రభుత్వం అడ్డుపడుతోందట
  •  అబద్ధాల పుట్ట చంద్రబాబు
హైదరాబాద్ లో ఆంధ్రావాళ్లను కొడుతున్నారని, వాళ్ల ఆస్తులు లాగేసుకుంటున్నారని ‘చంద్రబాబునాయుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు’ అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసలు, హైదరాబాద్ లో ఎక్కువ ఆస్తులు ఉన్నది చంద్రబాబుకు, ఆ పార్టీ  నాయకులకే అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడుతోందని పరిపాలన చేతగాని దద్దమ్మ చంద్రబాబు అంటున్నారని ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. సత్యహరిశ్చంద్రుడు తన ఇంటి పక్కనే పుట్టినట్టుగా, నీతికి నిజాయతీకి మారుపేరైనట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.  
Andhra Pradesh
Telangana
Chandrababu
Talasani

More Telugu News