నేనే సీఎం అయితే, అనంతపురం జిల్లాను దత్తత తీసుకుంటా: ధర్మవరంలో పవన్ కల్యాణ్

గోదావరి జిల్లాలను మించి అనంతపురం జిల్లా ఎదగాలని కోరుకుంటున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తే, రాయలసీమలో వలసలను నివారిస్తామని, అందుకు గాను సౌభాగ్య రాయలసీమ పథకం ప్రారంభిస్తామని, ప్రత్యేక హ్యాండ్లూమ్ జోన్స్ ఏర్పాటు చేస్తామని, ఇల్లు లేని ప్రతి చేనేత కార్మికుడికి ఇల్లు కట్టించి ఇస్తామని, సొంత మగ్గాలు లేని వారికి మగ్గాలు అందజేస్తామని, యువ రైతులను తయారు చేస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమ అభివృద్ధి కోసం తన ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటానని, పరిశ్రమలు తీసుకొస్తానని, మండలానికో వృద్ధుల ఆదరణ నిలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి తాను సీఎం అయితే, అనంతపురం జిల్లాను దత్తత తీసుకుంటానని పవన్ పేర్కొన్నారు.


More Telugu News