javed ahmed rana: దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా.. నాకే అవకాశం వస్తే మోదీని జైలుకి పంపుతా: నేషనల్ కాన్ఫరెన్స్ నేత జావెద్ అహ్మద్ రానా

  • జమ్ముకశ్మీర్, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని హత్యలకు మోదీపై కేసు పెడతా
  • మానవత్వాన్ని చంపిన హంతకుడు మోదీ
  • మీడియాను కూడా కటకటాల వెనక్కి పంపుతా
ప్రధాని మోదీపై నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత జావెద్ అహ్మద్ రానా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకే అవకాశం వస్తే మోదీని జైలుకు పంపుతానని అన్నారు. 'దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా. నాకే అధికారం ఉంటే, నాకే అవకాశం వస్తే... జమ్ముకశ్మీర్ లో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన హత్యలకు సంబంధించి భారత ప్రధాని మోదీపై కేసు నమోదు చేస్తా. ఆయనను జెల్లో పెట్టిస్తా' అంటూ వ్యాఖ్యానించారు. మానవత్వాన్ని చంపేసిన హంతకుడు మోదీ అని మండిపడ్డారు. రెండో హంతకురాలు మీడియా అని... విద్వేషాలను తీవ్ర స్థాయిలో రెచ్చగొట్టేలా కథనాలను ప్రచురించిన మీడియాను కూడా కటకటాల వెనక్కి పంపుతానని అన్నారు. జమ్ముకశ్మీర్ లోని పూంచ్ లో ఆయన మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.
javed ahmed rana
national conference
modi
bjp
jail

More Telugu News