Guntur District: కుట్రలు చేసే బాబుకు ఓటేస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా?: వైఎస్ జగన్

  • ఐదేళ్ల పాలనపై చర్చ జరగకుండా బాబు చూస్తున్నారు
  • చర్చ జరిగితే ఈ ఎన్నికల్లో బాబుకు ఓటమి తప్పదు
  • పూటకో కుట్ర తెరపైకి తెస్తున్నారు
కుట్రలు చేసే చంద్రబాబుకు ఓటేస్తే ఏపీలో ప్రజాస్వామ్యం బతుకుతుందా? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, తన ఐదేళ్ల పాలనపై చర్చ జరగకుండా చేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని, ఈ దుష్టపాలనపై కనుక చర్చ జరిగితే ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతానని చంద్రబాబుకు తెలుసని విమర్శించారు. చంద్రబాబు బినామీలు, ఎల్లో మీడియాకు కూడా అదేగతి పడుతుందని తెలుసని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా పూటకో కుట్రను తెరపైకి తెస్తున్నారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపే ప్రయత్నం చేస్తారని, ఎన్నికల తేదీ సమీపించే నాటికి బాబు కుట్రలు తార స్థాయికి చేరుకుంటాయని అన్నారు.
Guntur District
Vinukonda
YSRCP
Telugudesam
Chandrababu
jagan
Yellow media
Elections

More Telugu News