chandoo mondeti: 'కార్తికేయ 2'పై కసరత్తు చేస్తోన్న చందూ మొండేటి

  • 'కార్తికేయ'తో మంచి పేరు 
  • 'సవ్యసాచి'తో తగ్గిన అవకాశాలు
  •  సీక్వెల్ తో సెట్స్ పైకి  
చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ కథానాయకుడిగా 2014లో 'కార్తికేయ' సినిమా వచ్చింది. చిన్న సినిమాగా వచ్చి, కథాకథనాల కారణంగా పెద్ద విజయాన్ని సాధించింది. దర్శకుడిగా ఈ సినిమా చందూ మొండేటికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆయనతో సినిమా చేయడానికి నిర్మాతలు .. యువ కథానాయకులు ఆసక్తిని చూపించారు.

అయితే ఇటీవల చందూ మొండేటి తెరకెక్కించిన 'సవ్యసాచి' పరాజయంపాలు కావడంతో, సహజంగానే అవకాశాలు తగ్గాయి. పట్టాలెక్కుతాయనుకున్న ప్రాజెక్టులు ఆగిపోయాయి. దాంతో ఆయన 'కార్తికేయ' సీక్వెల్ పై దృష్టిపెట్టినట్టుగా తెలుస్తోంది. 'కార్తికేయ 2' చేసి .. ఆ సక్సెస్ తో మళ్లీ తన సత్తా చాటాలనే పట్టుదలతో వున్నాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం కథపై కసరత్తు చేస్తోన్న ఆయన, త్వరలోనే నిఖిల్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు
chandoo mondeti

More Telugu News