RGV: నా మాటలు నమ్మేంత వెర్రివాళ్లు ఉంటారనుకోవడంలేదు: రామ్ గోపాల్ వర్మ

  • భీమవరంలో పోటీపై క్లారిటీ
  • అది ఏప్రిల్ ఫూల్ జోకంటూ వెల్లడి
  • ట్విట్టర్ లో వివరణ
తన సినిమాలను పక్కనబెట్టి కేవలం మాటలతోనే గారడీ చేయగల నేర్పరి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా, ఏపీ ఎన్నికల బరిలో దిగి భీమవరం నుంచి పోటీచేస్తున్నట్టు ప్రకటించి సంచలనానికి తెరలేపాడు. నామినేషన్ల గడువు ముగిసినా, తనకు అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి వచ్చిందని, పవన్ పై పోటీ చేస్తున్నానని తెలిపాడు.

వర్మ నుంచి ఈ ట్వీట్ రావడంతో కొందరు సీరియస్ గానే పరిగణించినా, మరికొందరు తేలిగ్గా తీసుకున్నారు. దాంతో కాసేపటి తర్వాత వర్మే తన ట్వీట్ కు వివరణ ఇచ్చాడు. అయినా, తన మాటలు నమ్మేంత వెర్రివాళ్లు ఉంటారనుకోవడంలేదని, అదో ఏప్రిల్ ఫూల్ జోక్ అని స్పష్టం చేశాడు. కాస్త ముందుగా ఏప్రిల్ ఫూల్ చేద్దామని ప్రయత్నించానంటూ తాజా ట్వీట్ లో వెల్లడించాడు.
RGV
Pawan Kalyan
Andhra Pradesh

More Telugu News