Vizag: నాపై విశ్వాసం ఉంచిన చంద్రబాబుకు కృతఙ్ఞతలు: విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్

  • రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను
  • నాకు పాలిటిక్స్ కొత్తేమీ కాదు
  • యువత రాజకీయాల్లోకి రావాలి
తనపై విశ్వాసం ఉంచిన చంద్రబాబుకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని విశాఖపట్టణం టీడీపీ ఎంపీ అభ్యర్థి, నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు ఎం.శ్రీభరత్ అన్నారు. ‘ఏబీఎన్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తనకు పాలిటిక్స్ కొత్తేమీ కాదని అన్నారు. విశాఖలో తన తాతయ్య అభివృద్ధి వారసత్వాన్ని కొనసాగిస్తానని చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావాలని, సమాజం పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మనకు ఉన్న సమస్యలపై పౌరసమాజం ఎక్కువగా చర్చించాలని, ప్రతి విషయంపై ఆసక్తి కనబరచాలని సూచించారు. 
Vizag
Telugudesam
Mp
sribharath
Chandrababu

More Telugu News