Andhra Pradesh: ‘నీవల్లే బతికున్నా సామీ’ అని చంద్రబాబును కౌగిలించుకున్న నర్సమ్మ.. చప్పట్లు, ఈలలతో మార్మోగిన పుట్టపర్తి సభావేదిక!

  • అనంతపురం జిల్లా పుట్టపర్తిలో టీడీపీ ప్రచారం
  • హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
  • చంద్రబాబుతో కలిసి సైకిల్ ఎక్కిన నర్సమ్మ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఈరోజు ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. పుట్టపర్తిలో ఈరోజు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నర్సమ్మ అనే పెద్దావిడ మాట్లాడుతూ.. చంద్రబాబు తన పెద్దకొడుకు అయితే, పల్లె రఘునాథరెడ్డి చిన్నకొడుకని వ్యాఖ్యానించింది. చంద్రబాబు ఇచ్చిన పెన్షన్ తో తాను బతుకుతున్నానని చెప్పింది.

తనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నప్పటికీ, తన పెద్దకొడుకు చంద్రబాబే తనకు అన్నం పెడుతున్నాడని పేర్కొంది. ఈ సందర్భంగా ‘నీవల్లే నేను బతికున్నా సామీ’ అని చంద్రబాబును నర్సమ్మ ఒక్కసారిగా కౌగిలించుకుంది. దీంతో సభావేదిక ఒక్కసారిగా చప్పట్లు, ఈలలతో దద్దరిల్లింది. అనంతరం తాను ఎక్కిన సైకిల్ పై నర్సమ్మను ఎక్కించుకుని చంద్రబాబు ఫొటోలు దిగారు.
Andhra Pradesh
Telugudesam
Anantapur District
Chandrababu

More Telugu News