Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఝలక్.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్ రాజు!

  • ఎర్రగొండపాలెం టికెట్ ఇవ్వని చంద్రబాబు నాయుడు
  • బుద్దల అజితారావుకు టికెట్ కేటాయింపు
  • బాలినేని సమక్షంలో వైసీపీలో చేరిన డేవిడ్ రాజు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్ రాజు వైసీపీలో చేరారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.  టీడీపీ అధినేత చంద్రబాబు ఎర్రగొండపాలెం టికెట్ ను తనకు కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన డేవిడ్ రాజు ఈరోజు వైసీపీలో చేరినట్లు సమాచారం.

ఎర్రగొండపాలెం టికెట్ ను రాజకీయ సమీకరణాల్లో భాగంగా చంద్రబాబు బుద్దల అజితారావుకు కేటాయించారు. దీంతో డేవిడ్ రాజుకు చుక్కెదురైంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున డేవిడ్ రాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. ఇప్పుడు టికెట్ దక్కకపోవడంతో తిరిగి సొంతగూటికే చేరుకున్నారు.
Andhra Pradesh
Telugudesam
YSRCP
yarragondapalem
david raju

More Telugu News