manda Krishna Madiga: నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజం: మంద కృష్ణ మాదిగ విమర్శలు
నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజమని, మాదిగల విషయంలోనూ ఆయన అదే పని చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, తాము అమరావతిలో విశ్వరూప మహాసభ నిర్వహించాలని అనుకుంటే, ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని ఆయన అన్నారు. మాదిగలను నమ్మించి ద్రోహం చేసిన చంద్రబాబుకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతామని అన్నారు. సీట్ల కేటాయింపులోనూ మాలలకు పెద్ద పీట వేస్తూ, మాదిగలకు టీడీపీ అన్యాయం చేసిందన్నారు. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను శుక్రవారం నాడు ప్రకటిస్తామని ఆయన అన్నారు.