Hyderabad: హైదరాబాద్‌ కార్పొరేషన్‌లో టీడీపీ ఖాళీ... ఉన్న ఒక్క కార్పొరేటర్‌ గుడ్‌బై

  • పదవికి, పార్టీకి రాజీనామా చేసిన మందడి శ్రీనివాస్‌
  • రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన
  • రాష్ట్రంలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్యలు
హైదరాబాద్‌ కార్పొరేషన్‌లో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయింది. ఆ పార్టీకి ఉన్న ఏకైక కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌ గుడ్‌బై చెప్పేశారు. పదవితోపాటు పార్టీకి రాజీనామాచేసి ఆశ్చర్యపరిచారు. పైగా తాను పూర్తిగా రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు పూర్తి ప్రశ్నార్థకంగా మారిందని, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమయిందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకూడదని తీసుకున్న నిర్ణయం కూడా తనకు బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Hyderabad
corporator mandadi
Telugudesam

More Telugu News