Jagan: జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

  • ఆంధ్రావాళ్లు ద్రోహులు అన్న వారితో జగన్ పొత్తు
  • తెలంగాణలో అడుగుపెడితే కాళ్లు విరగ్గొడతామన్నారని మండిపాటు 
  • మరి మాతో ఎందుకు పొత్తు పొట్టుకోవాలనుకున్నారని కేటీఆర్ ప్రశ్న
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో జగన్‌పై నిప్పులు కురిపిస్తున్న చంద్రబాబు.. కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటి? అన్న జగన్ ప్రశ్నపై స్పందించారు. కేటీఆర్‌తో కలిస్తే తప్పేంటని జగన్ ప్రశ్నిస్తున్నారని, ఆంధ్రావాళ్లు ద్రోహులు, దొంగలు, తెలంగాణలో అడుగుపెడితే కాళ్లు విరగ్గొడతానన్న వాళ్లతో చేతులు కలపడం జగన్‌కే చెల్లించదని బుధవారం చంద్రబాబు ట్వీట్ చేశారు.  

చంద్రబాబు ట్వీట్‌కు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కౌంటరిచ్చారు. టీఆర్ఎస్‌పై విరుచుకుపడుతున్న మీరు ఇటీవలి ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో ఎందుకు పొత్తుపెట్టుకోవాలనుకున్నారో తనకు అర్థం కావడం లేదని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Jagan
Chandrababu
KTR
Andhra Pradesh
Telangana

More Telugu News