Andhra Pradesh: ఎన్నికల సంఘం తరపున రేపు హైకోర్టులో వాదనలు వినిపిస్తా: సీఈవో ద్వివేది

  • ఏపీ పరిణామాలను సీఈసీ నిశితంగా పరిశీలిస్తోంది
  • సీఎస్, డీజీపీ వివరణలను సీఈసీకి పంపుతున్నాం
  • ఎన్నికల సిబ్బంది తరలింపు ఇంటెలిజెన్స్ శాఖతోనే ముడిపడి ఉంటుంది
ఏపీ పరిణామాలను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిశితంగా పరిశీలిస్తోందని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈవో) గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై సీఈసీ సమాచారం సేకరిస్తోందని, జరుగుతున్న పరిణామాలను తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ నుంచి వచ్చే వివరణలను సీఈసీకి పంపుతున్నామని, ఎన్నికల  సంఘం తరపున రేపు హైకోర్టులో వాదనలు వినిపిస్తామని చెప్పారు. పోలీసుల కదలికలు, ఎన్నికల సిబ్బంది తరలింపు, శాంతి భద్రతలు, ఇంటెలిజెన్స్ శాఖ తోనే ముడిపడి ఉంటాయని అన్నారు. వివేకా హత్య కేసులో నిఘా విభాగం సమాచారం సేకరించాలి కదా, కిడారి హత్య కేసులో ఇంటెలిజెన్స్ పని ఉండదా? ఇంటెలిజెన్స్ తో సంబంధం లేకుండా ఎన్నికల నిర్వహణ ఎలా? సరైన అంచనా లేకుండా పోలీసులను ఎలా తరలిస్తారు? ఇంటెలిజెన్స్ లేకుండా పోలీస్ వ్యవస్థ ఉంటుందా? అని ప్రశ్నించారు.  
Andhra Pradesh
EC
gopala krishna dwivedi
CEC

More Telugu News