Anantapur District: జాబు రావాలంటే బాబు మళ్లీ మళ్లీ రావాలి: సీఎం చంద్రబాబు

  • మడకశిరలో ఊహించని అభివృద్ధి చేస్తా
  • 30 లక్షల ఉద్యోగాలు రానున్నాయి
  • జగన్ అధికారంలోకి వస్తే పరిశ్రమలు వస్తాయా?
జాబు రావాలంటే బాబు మళ్లీ మళ్లీ రావాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా మడకశిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, తన పాలనలో రూ.15 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 30 లక్షల ఉద్యోగాలు రానున్నాయని అన్నారు.

వచ్చే ఐదేళ్లలో మడకశిరలో ఊహించని అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజలందరి ఆశీస్సులు తనకు కావాలని, ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించి మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చేలా దీవించాలని కోరారు. అదే, జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా? అని ప్రశ్నించారు. వైసీపీకి ఒక్క ఓటు వేసినా బీజేపీకి వేసినట్టేనని ప్రజలకు సూచించారు.
Anantapur District
Madakasira
Chandrababu
cm

More Telugu News