Rahul Gandhi: రోడ్డుపై గాయపడి రక్తమోడుతున్న జర్నలిస్టును ఆసుపత్రికి తరలించి వార్తల్లో నిలిచిన రాహుల్

  • రోడ్డుపై గాయపడిన రాజేంద్ర వ్యాస్
  • రక్తమోడుతున్న వ్యాస్‌ను చూసిన రాహుల్
  • కారులో ఎక్కించుకుని ఎయిమ్స్‌కి తరలింపు
ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఓ ఫోటో జర్నలిస్టు ఆ సమాచారాన్ని కవరేజ్ చేస్తూ పొరపాటున మెట్లు జారి కిందకు పడుతుండగా  చెయ్యందించి వార్తల్లో నిలిచారు. నేడు ఆయన మరోసారి మానవత్వం చాటుకుని వార్తల్లో నిలిచారు. రాహుల్ తన వాహనంలో వెళుతుండగా రోడ్డుపై గాయపడిన రాజేంద్ర వ్యాస్ అనే జర్నలిస్టును చూశారు.

వెంటనే కారు ఆపి ఆయనను తన కారులో ఎక్కించుకుని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రాజేంద్ర వ్యాస్‌కు నుదుటికి దెబ్బ తగిలి రక్తం కారుతోంది. రాజస్థాన్‌కి చెందిన వ్యాస్, సెంట్రల్ ఢిల్లీలోని హనుమాన్ రోడ్డులో ప్రమాదానికి గురయ్యారు. రాహుల్ సిబ్బంది రక్తమోడుతున్న వ్యాస్‌ను కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Rahul Gandhi
Rajendra Vyas
Photo Journalist
Delhi
Rajasthan

More Telugu News