Andhra Pradesh: వైసీపీలో చేరిన పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్!

  • అనుచరులు, మద్దతుదారులతో కలిసి వైసీపీ తీర్థం
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్
  • పార్టీలో చేరిన చిలకలూరిపేట టీడీపీ చీఫ్ రాజేష్ నాయుడు
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ రాజకీయ వలసలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ ఈరోజు వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో ఈరోజు తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వీరందరికీ కండువాలు కప్పిన జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా  పంతం గాంధీమోహన్  మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇదిలావుంచితే, వీరితో పాటు గుంటూరు జిల్లా చిలకలూరిపేట టీడీపీ నేత మల్లెల రాజేష్‌నాయుడు, ఆయన అనుచరులు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Andhra Pradesh
YSRCP
East Godavari District
peddapueram
pantam gandhi mohan

More Telugu News