Ramgopal Varma: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చూసేందుకు ఎగబడుతున్న ప్రజలు... జై బాలయ్య: రామ్ గోపాల్ వర్మ

  • మొదలైన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అడ్వాన్స్ బుకింగ్స్
  • ఏంఎంబీ సినిమాస్ హౌస్ ఫుల్
  • ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మ
మరో రెండు రోజుల్లో విడుదల కానున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా, 10 నిమిషాల వ్యవధిలో ఓ మల్టీ ప్లెక్స్ లో 1000 టికెట్లు అమ్ముడు కావడాన్ని ప్రస్తావిస్తూ, ఓ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

"ఓపెనింగ్స్ స్పీడ్ చూస్తుంటే కథానాయకుడు, మహానాయకుడు కన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని చూడడానికే ప్రజలు ఎగబడుతున్నారు, అంటే నిజంగా నిజమే గెలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. జై బాలయ్య" అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో హౌస్ ఫుల్ అయినట్టు చూపుతున్న థియేటర్ సీటింగ్ స్క్రీన్ షాట్ ను కూడా యాడ్ చేశారు.



Ramgopal Varma
Lakshmis NTR
Housefull
AMB Cinemas

More Telugu News