Congress: విజయవాడలో 31న కాంగ్రెస్‌ బహిరంగ సభ...హాజరుకానున్న రాహుల్‌గాంధీ

  • తీరికలేని షెడ్యూల్‌లోనూ సభకు అంగీకారం
  • పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న పార్టీ చీఫ్
  • ఏర్పాట్లలో పార్టీ నాయకులు, కార్యకర్తలు
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ నెల 31వ తేదీన విజయవాడ వస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని సమీపంలో నిర్వహించనున్న పార్టీ భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, వివిధ రాష్ట్రాల్లో ప్రచారం, సొంత నియోజకవర్గం అమేథీలో గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలతో క్షణం తీరికలేకుండా బిజీగా ఉన్న రాహుల్‌ ఏపీ పర్యటనకు ఓ రోజు కేటాయించడం గమనార్హం.

పార్టీ చీఫ్‌ వస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు అవసరమైన ఏర్పాట్లలో మునిగి ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి అంతంతగానే ఉన్న నేపథ్యంలో విజయవాడ సభలో ప్రసంగించనున్న రాహుల్‌గాంధీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని, ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు ఉత్సాహం నింపుతారని భావిస్తున్నారు.
Congress
Rahul Gandhi
Vijayawada

More Telugu News