Andhra Pradesh: పవన్ కల్యాణ్ బెట్టింగ్ విమర్శలు.. ఘాటుగా స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్!

  • నెల్లూరు సభలో పవన్ విమర్శలు
  • బెట్టింగ్ లు మానేయాలని అనిల్ కు సూచన
  • తనపై కేసులేవీ లేవన్న అనిల్
ఇటీవల నెల్లూరులో జరిగిన బహిరంగ సభలో వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తన అభిమాని అని చెప్పుకునే అనిల్ బెట్టింగులు మానేసి, తన అభిమానిగా చెప్పుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ మరీ ఇంతగా దిగజారిపోతారని అనుకోలేదని వ్యాఖ్యానించారు.

బెట్టింగ్ వ్యవహారంలో తనకు నోటీసు మాత్రమే వచ్చిందనీ, ఎలాంటి కేసు తనపై లేదని స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేసేముందు ఇకపై పోలీసుల నుంచి సమాచారం తీసుకుని మాట్లాడాలని సూచించారు. ఈ మేరకు అనిల్ కుమార్ ఈరోజు ట్విట్టర్ లో స్పందించారు. నిరాధార ఆరోపణలతో పవన్ తన స్థాయిని దిగజార్చుకున్నారని అనిల్ దుయ్యబట్టారు.
Andhra Pradesh
Pawan Kalyan
Jana Sena
YSRCP
ANIL KIMAR
Nellore District
CASE
Police

More Telugu News