Galla Jayadev: 22 ఎంపీ, 120 ఎమ్మెల్యే సీట్లు గ్యారెంటీ: గల్లా జయదేవ్ ధీమా

  • వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం
  • బీజేపీ చేతిలో జగన్ ఓ కీలుబొమ్మ
  • పెదకాకానిలో గల్లా జయదేవ్ రోడ్ షో
రానున్న ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ 22 లోక్ సభ స్థానాలను, 120 అసెంబ్లీ స్థానాలను సులువుగా గెలుచుకుంటుందని గుంటూరు ఎంపీ, అదే స్థానానికి మరోసారి పోటీ పడుతున్న గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. పెదకాకాని మండలంలో రోడ్ షో నిర్వహించిన ఆయన, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

ముస్లిం సోదరులను వైఎస్ జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించిన ఆయన, భవిష్యత్తులో వైసీపీని బీజేపీలో విలీనం చేస్తారని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేస్తుంటే, ఆ పార్టీ చేతిలో జగన్ కీలుబొమ్మగా మారారని, కేసీఆర్ తో కలిసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇండియాలో ఉన్నది రెండే కూటములని, యూపీఏ, ఎన్డీయే మినహా మరే కూటమి లేదని, ఫెడరల్ ఫ్రంట్ లో కనిపిస్తున్నది కేసీఆర్, జగన్ లు మాత్రమేనని గల్లా జయదేవ్ ఎద్దేవా చేశారు.
Galla Jayadev
Pedakakani
YSRCP
Telugudesam

More Telugu News