ka paul: పాల్ వద్ద ప్రస్తుతం రూపాయి ఆస్తి కూడా లేదట!

  • తనను గెలిపిస్తే రూ.7 లక్షల కోట్లతో ఏపీని అమెరికాలా మారుస్తానని హామీ
  • పగిలిపోయే గ్లాసు, తుప్పుపట్టిన ఫ్యాన్, సైకిలుకు ఓటేయొద్దని పిలుపు
  • పాల్ రావాలి.. పాలన మారాలి నినాదంతో ముందుకెళ్లాలని సూచన
ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తనకు రూపాయి కూడా ఆస్తి లేదని పేర్కొన్నారు. గతంలో తాను సంపాదించిన 3.5 లక్షల కోట్లు వివిధ ట్రస్టులకు ఇచ్చేశానని చెప్పారు. పగిలిపోయే గ్లాసు, తుప్పుపట్టిన సైకిల్, ఫ్యాన్‌ పార్టీలకు ఓటెయ్యొద్దని కోరిన ఆయన తనను గెలిపిస్తే ఏపీని అమెరికాలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన పాస్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పాల్ రావాలి.. పాలన మారాలి’ అనే నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. తనను గెలిపిస్తే రూ. 7 లక్షల కోట్లు తెచ్చి ఏపీని అమెరికాలా తీర్చి దిద్దుతానని పాల్ హామీ ఇచ్చారు.
ka paul
prajashanthi party
YSRCP
Telugudesam

More Telugu News