Jagan: విచారణ పేరుతో చిత్ర హింసలు పెడుతున్నారు.. వివేకా హత్య కేసులో జగన్ సన్నిహితుడి భార్య ఆరోపణ

  • 21న నా భర్తను తీసుకువెళ్లారు 
  • పోలీసులు చిత్రహింసలు పెడుతున్నట్టు అనుమానంగా ఉంది
  • దేవిరెడ్డి శంకర్‌రెడ్డి భార్య ఆవేదన
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణ పేరుతో పోలీసులు తన భర్తను చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్ సన్నిహితుడు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి భార్య తులసమ్మ ఆరోపించారు. ఈ నెల 21న ఈ కేసు విచారణ కోసం ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఆదేశాల మేరకు తన భర్త వెళ్లారని, కానీ అప్పటి నుంచి తిరిగి రాలేదని పేర్కొన్నారు.

తన భర్తను పోలీసులు చిత్ర హింసలు పెడుతున్నట్టు అనుమానంగా ఉందన్నారు. నిజానికి తన భర్త ఆర్జేడీ అభ్యర్థిగా నామినేషన్ వేశారని, అయితే పోలీసుల నిర్బంధంలో ఉన్న కారణంగా అఫిడవిట్ సమర్పించలేకపోయినట్టు తెలిపారు. పోలీసులు వెంటనే తన భర్తను విడిచిపెట్టాల్సిందిగా ఆమె కోరారు.
Jagan
YSRCP
ys vivekanandareddy
devireddy Shankar reddy
Kadapa District
Police
murder

More Telugu News