TRS: 'జై తెలుగుదేశం'... అనేసి అలవాటులో పొరపాటన్న టీఆర్ఎస్ నేత!

షార్ట్స్‌లో చూడండి
"జై కేసీఆర్... జై తెలుగుదేశం"... ఇలా అన్నది ఎవరో తెలుసా టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మల్కాజిగిరి ఎన్నికల ఇన్‌ చార్జి సుధీర్‌రెడ్డి. మేడ్చల్ లో జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో తన ప్రసంగాన్ని ముగించిన తరువాత, "జై కేసీఆర్... జై తెలుగుదేశం" అనేసి తన కుర్చీలో కూర్చుండి పోయారాయన. టీఆర్ఎస్ శ్రేణులు నవ్వుతుంటే, ఏం జరిగిందో తెలుసుకుని తిరిగి మైకందుకుని, "జై తెలంగాణ" అన్నారు. ఆ సమావేశం తరువాత సుధీర్ రెడ్డిని చుట్టుముట్టిన మీడియా, మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నారా? అని ప్రశ్నించగా, "ఏదో అలవాటులో పొరపాటుగా వచ్చింది. ఇంక ఆ పార్టీలోకి ఎవరు వెళ్తారు?" అని ప్రశ్నించారు. తాను టీఆర్ఎస్ లోనే ఉంటానని, పార్టీకి కట్టుబడి పనిచేస్తానని చెప్పేసి వెళ్లిపోయారు.
Go Back to Shorts
TRS
Telugudesam
Sudhirreddy
KCR

More Telugu News