Bheemili: ప్రచారం చేస్తున్న జనసేన అభ్యర్థి సందీప్ పంచకర్లపై వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అనుచరుల దౌర్జన్యం.. వీడియో వైరల్

  • రెచ్చిపోయిన అవంతి శ్రీనివాస్ అనుచరులు
  • జనసేన ప్రచార రథంపైకి ఎక్కి మరీ వార్నింగ్
  • భీమిలిలో తీవ్ర ఉద్రిక్తత
భీమిలిలో ప్రచారం చేస్తున్న జనసేన అభ్యర్థి డాక్టర్ సందీప్ పంచకర్లపై వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను జనసేన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా, అది విపరీతంగా వైరల్ అవుతోంది. జనసేన అభ్యర్థి తన ప్రచారంలో అవంతి శ్రీనివాస్‌పై విమర్శలు చేయడాన్ని జీర్ణించుకోలేని ఆయన అనుచరులు జనసేన ప్రచార రథంపైకి ఎక్కి మరీ దౌర్జన్యానికి దిగారు.

ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రచారంలో తాము విమర్శిస్తామని, కావాలంటే ప్రతి విమర్శలు చేసుకోవాలి తప్పితే ఇలా అందరూ చూస్తుండగా దాడులకు దిగడం సరికాదని జనసేన అభ్యర్థి సందీప్ చెబుతున్నా వినిపించుకోని అవంతి అనుచరుడు ఒకరు ఆయన మీదిమీదికి వెళ్లాడు. దీంతో పరిస్థితి అదుపుతప్పుతోందని భావించిన కొందరు నేతలు సర్దిచెప్పడంతో ఘర్షణ వాతావరణానికి ఫుల్‌స్టాప్ పడింది.
Bheemili
Visakhapatnam District
Avanthi srinivas
YSRCP
Jana Sena
sandeep panchakarla

More Telugu News