Nara Lokesh: ​ ఇదేమన్నా గోలీల ఆటా!.. ఒక్క అవకాశం ఇవ్వడానికి!: జగన్ పై నారా లోకేశ్ విమర్శలు

  • పసుపుకుంకుమలు తుడిచేస్తాడు
  • ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టాడు
  • ఎవరు కావాలో ఆలోచించండి
ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం తర్వాత రాష్ట్రస్థాయి ప్రచారానికి తెరలేపారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా తెర్లాంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత జగన్ ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడని, ఇదేమన్నా గోలీల ఆటా ఒక్క చాన్స్ ఇవ్వడానికి? అంటూ మండిపడ్డారు.

"ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు మీ ఓటుపై ఆధారపడి ఉంది. మీకు పసుపు కుంకుమ పెట్టిన వ్యక్తి కావాలా? లేక పసుపు కుంకుమ తుడిచేసే వ్యక్తి కావాలా? మీకు 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి కావాలా? లేక 16 నెలలు జైలుకెళ్లి 31 కేసులున్న వ్యక్తి కావాలా? ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న వ్యక్తి కావాలా? లేక ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తెలంగాణ వాళ్లకు తాకట్టు పెట్టే వ్యక్తి కావాలో మీరే ఆలోచించుకోండి" అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News