Srikakulam District: టీడీపీ కంచుకోటకు కాపలా కాస్తున్న కార్యకర్తలందరికీ పాదాభివందనం: నారా లోకేశ్

  • ఆముదాలవలసలో టీడీపీ ఎన్నికల ప్రచార సభ
  • నాటి పాలకులు టీడీపీ కార్యకర్తలను తరిమి చంపేశారు
  • పరిటాల రవీంద్రను కళావెంకట్రావు కళ్ల ముందే కాల్చి చంపారు
ఆనాటి పాలకులు టీడీపీ కార్యకర్తలను తరిమి తరిమి చంపేశారని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, నాడు పరిటాల రవీంద్రను కళావెంకట్రావు కళ్ల ముందే కాల్చి చంపడం జరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇటువంటి దారుణ సంఘటనలు జరిగినా కూడా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీ కంచుకోటకు కాపలా కాస్తున్న కార్యకర్తలందరికీ పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డా ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత చంద్రబాబుది అని ప్రశంసించారు.
Srikakulam District
aamudala valasa
Telugudesam
lokesh

More Telugu News