Chevireddy Bhaskar Reddy: నా భర్తను నామినేషన్ ఉపసంహరించుకోమంటూ వైసీపీ బెదిరిస్తోంది: స్వతంత్ర అభ్యర్థి భార్య ఫిర్యాదు

  • వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోటీ
  • స్వతంత్ర అభ్యర్థిగా భాస్కరరెడ్డి పోటీ
  • ఓట్లు చీలుతాయేమోనని వైసీపీ భయం
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి బెదిరిస్తున్నారంటూ అక్కడి స్వతంత్ర అభ్యర్థి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. చంద్రగిరిలో వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. అదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మరో అభ్యర్థి భాస్కరరెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరి పేర్లూ ఒకటే కావడంతో ఓట్లు చీలిపోతాయేమోననే భయం వైసీపీలో నెలకొంది. దీంతో స్వతంత్ర అభ్యర్థిపై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న తన భర్తను నామినేషన్ ఉపసంహరించుకోవాలని, లేదంటే చంపేస్తామని చెవిరెడ్డి బెదిరిస్తున్నారని బాస్కరరెడ్డి భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు.
Chevireddy Bhaskar Reddy
YSRCP
Indipendent Contestant
Bhaskar Reddy
Nomination

More Telugu News